Varalakshmi Vratam | Varalakshmi Vratam Pooja Procedure


వరలక్ష్మీ వ్రతం..పూజా విధానం

నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సుర పూజితే

శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే

తాత్పర్యం:
మహామాయారూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీ దేవి అష్త్టెశ్వర ప్రదాయిని. అష్ట సంపదల్ని అందించే జగన్మంగళ దాయిని. అష్త్టెశ్వరాల్నీ కలగజేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీ దేవిగా మనం ఆరాధిస్తాం. భక్తితో పూజించినవారికీ, కొలిచినవారికీ కొంగుబంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మి.
వ్రత విధి విధానం:
శ్రావణమాసంలోని శుభశుక్రవారం నాటి వరలక్ష్మివ్రతం తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలను ప్రతి ప్రతిబింబించే పర్వదినం. భాగ్యదాయిని, సౌభాగ్యదాయిని అయిన వరలక్ష్మిదేవిని మనం వరాలు కోరుకోవాలంటే ముందుగా ఆ దేవిని ప్రసన్నం చేసుకోవాలి. అందుకే ఈ వ్రతం చేస్తారు.
వరలక్ష్మి వ్రతంరోజున మహిళలు తెల్లవారే నిద్రలేచి ఇళ్ళు , వాకిళ్ళు కడిగి ముగ్గులు పెట్టుకోవాలి. గుమ్మాలకు మంగళతోరణాలతో అలంకరించాలి. గడపలకు పసుపురాసి కుంకుమబొట్లు పెట్టాలి. ఇంట్లో తూర్పుదిక్కున మండపం ఏర్పరుచుకోవాలి.ఆ మండపాన్ని అరటిపిలకలు, పువ్వులు , మామిడి తోరణాలతో అలంకరించాలి.మండపానికి పసుపు, కుంకుమలు పెట్టుకోవాలి.
మండపంలో వెనుకవైపుగా లక్ష్మీదేవి చిత్రపటాన్నిగానీ, విగ్రహాన్నీగానీ వుంచాలి. బంగారు, వెండి లేదా ఇతర లోహపు చెంబును శుభ్రంగా తోమి, పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. దీనిపై కలశం ఏర్పరుచుకోవాలి. కొబ్బరికాయకు పసుపురాసి, కుంకుమ బొట్లు పెట్టి, కొత్త రవిక గుడ్డ కప్పి కలశం ఏర్పరుచుకోవచ్చు.లేదా బంగారు లేక వెండి ముఖాన్నికూడా కలశంపై పెట్టుకోవచ్చు.
మల్లెలు, మొల్లలు, సంపెంగలు , మొగలి పువ్వులతో కలశాన్ని,మండపాన్ని అలంకరించాలి. పలురకాల పువ్వులు,పండ్లు, పసుపు కుంకుమలు-అక్షింతలు సిద్ధం చేసుకోవాలి.
వరలక్ష్మి వ్రతంనాడు తొమ్మిది రకాల పిండివంటలు చేసి,ఆ దేవికి నైవెద్యం పెట్టాలని పెద్దలు చెపుతారు. తొమ్మిది రకాలు చేయలేని వారు, తమకు చేతనైనన్ని చేసుకోవచ్చు.

తొలుత పసుపుతో గణపతిని చేసి పూజించి, కలశం లోనికి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ తరువాత అథాంగ పూజచేయవలెను. దాని తరువాత అష్టోత్తరశతనామ పూజతో నామాలను చదివి, దూప, దీప, నైవేద్యాలను తాబూలాలని సమర్పించి కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇచ్చి తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడిచేతికి కట్టుకొనవలెను. నవకాయ పిండివంటలూ, పండ్లూ మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి. చివరగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువకు తాంబూలం సమర్పిస్తూ ఆమెని మహాలక్ష్మీగా భావించి వాయనమీయవలెను.

వరలక్ష్మి వ్రతం పూజ సామగ్రి: 

పసుపు, కుంకుమ, తమల పాకులు, వక్కలు, అరటి పండ్లు, ఊదు బత్తీలు/దూపం కలికెలు, హారతి కర్పూరము, పసుపు అక్షతలు, పూలు, కొబ్బరి కాయ/కలశం మీదికి, కొబ్బరికాయ అర్చనకు, దీపారాధన కుంది - పెద్దది, దీపారాధన కుంది - చిన్నది, గంధం, గంట, హారతి పళ్లెము, వత్తులు, దీపారాదన నూనె ఆవునెయ్యి, అమ్మవారికి కలశము, అర్చన కలశము, పంచామృతాలు, అమ్మవారికి పీఠము/పీట, ఒక పళ్లెము - దీపారాధన హారతి పళ్లెము ఉంచుటకు, బియ్యముతో ఉన్న చిన్న పళ్లెము పసుపు గణపతికి, ఒక రవికె గుడ్డ, అమ్మవారి అలంకరణ సామగ్రి, వడపప్పు, (ఆనవాయితి ఉంటే) పానకము (ఆనవాయితి ఉంటే), పతిని పావలా కసుగా చేసి కుంకుమతో అధినవి రెండు వస్త్రాలు, పత్రితో రుద్రాక్షమాలగా చేసి పసుపు/కుంకుమ లతో అలదిన యజ్ఞ ఉపవీతము, అర్చన కలశము ప్రక్కన గిన్నె, ఆచమనమునకు గ్లాసు ప్రక్కన పల్ల్లేము, కొద్దిగ ఏలకులు/లవంగాల పొడి, చెంచాలు, కూర్చొను వారికి తగినన్ని పీటలు, నూతన వస్త్రాలు అమ్మవారికి ధరింప దలచితే ప్రత్హి వస్త్రాలు అక్కరలేదు, మామిడి ఆకులు మందిర అలంకరణకు, చిల్లర రూపాయిలు, పన్నీరు లేక గంధము కలిపిన నీరు, నవ సూత్రములు ఎంత మంది పూజకు ఉంటే అంతమందికి తెల్లని దారములు తీసుకొని తొమ్మిది ముడులు వేసి కుంకుమలో అలధినవి. పాటకు జ్యోతులు తొమ్మిది బియ్యపు పిండి బెల్లముతో కలిపి చేసినవి, నానబోసిన శనగలు,

శ్రీ వర లక్ష్మి పూజ సామగ్రి :

దీపాలు, గంట, హారతి ప్లేటు, స్పూన్స్, ట్రేలు, నూనె, వత్తులు, అగ్గిపెట్టె, గ్లాసులు, బౌల్స్ తోపాటు 
పసుపు ................. 150 grms
కుంకుమ .................150 grms
గంధం .................... 1box
విడిపూలు................ 1/2 kg
పూల మాలలు ........... 9
తమలపాకులు............ 35
వక్కలు..................... 150 grms
ఖర్జూరములు..............50 grms
అగర్బత్తి ....................1 pack
కర్పూరము.................60 grms
చిల్లర పైసలు .............. Rs. 30/- ( 1Rs coins )
తెల్ల టవల్ .................1
బ్లౌస్ పీసులు .............. 2
మామిడి ఆకులు, అమ్మవారి ఫోటోలు
అరటిపండ్లు ................ 2 డజన్
ఇతర రకాల పండ్లు ........ ఐదు రకాలు
కలశము .................... 1
కొబ్బరి కాయలు ............ 3
తెల్ల దారము లేదా నోము దారము లేదా పసుపు రాసిన కంకణం ............2
స్వీట్లు......
బియ్యం ..................2 kg
కొద్దిగా పంచామృతం లేదా పాలు 100 ML

తోరం ఎలా తయారుచేసుకోవాలి : 
తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపురాసుకోవాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటేఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆవిధంగా తోరాలనుతయారుచేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.

గణపతి పూజ: 
అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥
ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన
పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥
గణపతిపై అక్షతలు చల్లాలి. యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి.
ఓం సుముఖాయ నమః,
ఓం ఏకదంతాయ నమః,
ఓం కపిలాయ నమః,
ఓం గజకర్ణికాయ నమః,
ఓం లంబోదరాయ నమః,
ఓం వికటాయ నమః,
ఓం విఘ్నరాజాయ నమః,
ఓం గణాధిపాయ నమః,
ఓంధూమకేతవే నమః,
ఓం వక్రతుండాయ నమః,
ఓం గణాధ్యక్షాయ నమః,
ఓం ఫాలచంద్రాయ నమః,
ఓం గజాననాయ నమః,
ఓం శూర్పకర్ణాయ నమః,
ఓం హేరంబాయ నమః,
ఓం స్కందపూర్వజాయనమః,
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూస్వామిపై పుష్పాలు ఉంచాలి.

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి. 

స్వామివారి ముందు పళ్ళుగానీ బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి.
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం,
భర్గోదేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్!!

నీటిని నివేదన చుట్టూ జల్లుతూ … సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి… ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓంవ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహాగుడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటినివదలాలి). ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం అచమనంసమర్పయామి. (కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి)ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామినీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి!అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీతసుప్రసన్న వరదాభవతు! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు!!

వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి. ఈ విధంగామహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.

కలశపూజ : 
కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః
మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ ఃస్థితాః
కుక్షౌతుస్సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో అధర్వణః
అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః
ఆయాంతు గణపతి పూజార్థం దురితక్షయకారకాఃగంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు॥
అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపైన, పూజాద్రవ్యాలపైన, పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి.

అధాంగపూజ: 
పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి.
చంచలాయై నమః – పాదౌ పూజయామి, చపలాయై నమః – జానునీ పూజయామి, పీతాంబరాయైనమః – ఉరుం పూజయామి, కమలవాసిన్యైనమః – కటిం పూజయామి, పద్మాలయాయైనమః -నాభిం పూజయామి, మదనమాత్రేనమః – స్తనౌ పూజయామి, కంబుకంఠ్యై నమః- కంఠంపూజయామి, సుముఖాయైనమః – ముఖంపూజయామి, సునేత్రాయైనమః – నేత్రౌపూజయామి, రమాయైనమః – కర్ణౌ పూజయామి, కమలాయైనమః – శిరః పూజయామి, శ్రీవరలక్ష్య్మైనమః – సర్వాణ్యంగాని పూజయామి. (ఆ తరువాత పుష్పాలతో అమ్మవారిని ఈ అష్టోత్తర శతనామాలతో పూజించాలి)
శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి 
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృతై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూత హితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓంపరమాత్మికాయై నమః
ఓం వాచ్యై నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం శుచయే నమః
ఓంస్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓంహిరణ్మయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యైనమః
ఓం ఆదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం రమాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓంకామాక్ష్యై నమః
ఓం క్రోధ సంభవాయై నమః
ఓం అనుగ్రహ ప్రదాయై నమః
ఓంబుద్ధ్యె నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓంఅమృతాయై నమః
ఓం దీపాయై నమః
ఓం తుష్టయే నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓంలోకశోకవినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓంలోకమాత్రే నమః
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓంపద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓంపద్మముఖియై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓంపద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మ గంధిన్యైనమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖీయైనమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓంచంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్ర రూపాయై నమః
ఓంఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుష్ట్యెనమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం దారిద్ర నాశిన్యై నమః
ఓం ప్రీతా పుష్కరిణ్యైనమః
ఓం శాంత్యై నమః
ఓం శుక్లమాలాంబరాయై నమః
ఓం శ్రీయై నమః
ఓంభాస్కర్యై నమః
ఓం బిల్వ నిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యైనమః
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓంహేమమాలిన్యై నమః
ఓం ధనధాన్యకర్యై నమః
ఓం సిద్ధ్యై నమః
ఓం త్రైణసౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశగతానందాయై నమః
ఓంవరలక్ష్మ్యై నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓంహిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః
ఓంమంగళాదేవ్యై నమః
ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః
ఓం ప్రసన్నాక్ష్యైనమః
ఓం నారాయణసీమాశ్రితాయై నమః
ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః
ఓంసర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓంబ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
ఓంభువనేశ్వర్యై నమః

తోరపూజ : 
తొమ్మిది దారపుపోగులతో తొమ్మిది ముడులు వేసి మధ్య మధ్య పంచపుష్పాలను కట్టి దానికి తోరగ్రంథి పూజ చేయవలెను.తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో 

ఈ క్రింది విధంగా పూజ చేయాలి

కమలాయైనమః – ప్రథమగ్రంథిం పూజయామి,
రమాయైనమః – ద్వితీయ గ్రంథింపూజయామి,
లోకమాత్రేనమః – తృతీయ గ్రంథింపూజయామి,
విశ్వజనన్యైనమః – చతుర్థగ్రంథింపూజయామి,
మహాలక్ష్మ్యై నమః – పంచమగ్రంథిం పూజయామి,
క్షీరాబ్ది తనయాయై నమః – షష్ఠమ గ్రంథిం పూజయామి,
విశ్వసాక్షిణ్యై నమః – సప్తమగ్రంథిం పూజయామి,
చంద్రసోదర్యైనమః – అష్టమగ్రంథిం పూజయామి,
శ్రీ వరలక్ష్మీయై నమః – నవమగ్రంథిం పూజయామి.
ఈ కింది శ్లోకాలు చదువుతూ తోరం కట్టుకోవాలి
బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే

వ్రత కథా ప్రారంభం : Click Here To 

లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం
శ్రీ రంగథామేశ్వరీం|
దాసీభూత సమస్తదేవ వనితాం

లోకైక దీపాంకురాం|
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవః

బ్రహ్మేంద్ర గంగాధరాం|
త్వాం త్రిలోక్య కుటుంబినీం సరసిజాం

వందేముకుందప్రియాం||

పూజ పూర్తయిన తర్వాత ఇరుగు పొరుగు ముత్తైదువులను పిలుచుకుని దక్షిణ తాంబూలాలు ఇచ్చుకోవాలి. స్త్రీలకు తాంబూలముతో పాటు వరలక్ష్మీ వ్రత పుస్తకాలను కూడా అందజేయాలి. 
వరలక్ష్మీ వ్రత పర్వదినమున అష్టలక్ష్మీ దేవాలయములతో పాటు లక్ష్మీదేవీ ఆలయాలను దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పురోహితులు అంటున్నారు. ఇంకా దేవాలయాల్లో శ్రీ లక్ష్మీ కుంకుమ పూజ, శ్రీ లక్ష్మీ అష్టోత్తరనామ పూజలు, పంచామృతములతో అభిషేకం చేయించడం సకల భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది. 
శుక్రవారం పూటే వచ్చిన శ్రీ వరలక్ష్మీ వ్రత దినాన నిష్టతో లక్ష్మిదేవిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు. ఆ రోజున స్త్రీలు వరలక్ష్మి భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం.
సాయంత్రం పూట ఇరుగు పొరుగున ఉన్న ముత్తైదువులను పేరంటానికి పిలిచి కాళ్ళకు పసుపురాసి, నుదుట కుంకుమ పెట్టి, మెడకు గంధాన్ని అద్ది గౌరవిస్తారు. ముత్త్తెదువులందరితో కలసి వరలక్ష్మీ వ్రత మహాత్మ్యాన్ని తెలిపే కథను శ్రవణం చేస్తారు. ఇలా చేయడం ద్వారా ఆ ఇంట సిరిసంపదలు, సౌభాగ్యం వెల్లివిరుస్తుందని పండితులు చెప్తున్నారు.

Related Postings
1.Varalakshmi Vratam 
2.Ganapati Pooja 
3.Dharma Sandehalu

keywords:
What is Varalakshmi Vratam?,Varalakshmi Vratam History In Telugu,Varalakshmi Vratam Telugu,Varalakshmi Vratam Story In Telugu,Varalakshmi Vratam Pooja Vidhi,Varalakshmi Vratam Pooja vidhanam,Varalakshmi Vratam PDF books,Varalakshmi Vratam PDF Freebooks Download,varalakshmi vratham in telugu,varalakshmi vratham pooja procedure,varalakshmi vratham pooja procedure,varalakshmi vratham pooja vidhanam in telugu free download,Sri Varalakshmi Vratham Pooja Vidhanam 2018, Varalaxmi Puja, Sravana Lakshmi Puja,Varalakshmi Puja, Pooja Samagri & Vrata Vidanam.Significance of Varalakshmi Vratam,వరలక్ష్మీ వ్రతం..పూజా విధానం.,వరలక్ష్మీ వ్రతం రోజున స్తోత్రము,Varalakshmi Puja Items వరలక్ష్మి వ్రత పూజ సామాగ్రి,వరలక్ష్మీ వ్రతం పూజ విధానం,వరలక్ష్మీ వ్రత కధ

Comments